News October 21, 2025
జపాన్ ప్రధానిగా సనాయి తకాయిచి ఎన్నిక

జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. తొలి మహిళా ప్రధానిగా లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నేత సనాయి తకాయిచి ఎన్నికయ్యారు. పార్లమెంట్ లోయర్ హౌస్‌లో జరిగిన ఎన్నికలో మొత్తం 465 ఓట్లకుగానూ ఆమె 237 ఓట్లు సాధించారు. ఇక అప్పర్ హౌస్‌లోనూ తకాయిచి ఎన్నిక లాంఛనమే కానుంది. కాగా ఐరన్ లేడీ ఆఫ్ జపాన్’గా గుర్తింపు పొందారు.
Similar News
News October 21, 2025
ఇండియాపై పాక్ ఆరోపణలు.. దీటుగా బదులిచ్చిన అఫ్గాన్

ఇటీవల జరిగిన సరిహద్దు ఘర్షణల్లో ఇండియా హస్తం ఉందంటూ పాక్ చేసిన ఆరోపణలపై అఫ్గాన్ దీటుగా స్పందించింది. అవి నిరాధార, ఆమోదయోగ్యంకాని ఆరోపణలని మండిపడింది. ఓ స్వతంత్ర దేశంగా భారత్‌తో బంధం కొనసాగిస్తామని అఫ్గాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్ స్పష్టంచేశారు. ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాలను వాడుకునేందుకు ఎన్నటికీ అనుమతివ్వబోమని చెప్పారు. పాక్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని అన్నారు.
News October 21, 2025
6 లక్షల వర్కర్ల స్థానంలో రోబోలు.. అమెజాన్ ప్లాన్!

ఆటోమేషన్ దిశగా అమెజాన్ అడుగులేస్తోంది. 2033 నాటికి అమెరికాలో 6 లక్షల ఉద్యోగాలను రోబోలతో ఆ సంస్థ భర్తీ చేయనున్నట్లు The New York Times నివేదిక వెల్లడించింది. కంపెనీ మొత్తం కార్యకలాపాలలో 75% ఆటోమేట్ చేసే దిశగా రోబోటిక్ టీమ్ పని చేస్తోందని చెప్పింది. 2027 నాటికి భర్తీ చేయాల్సిన 1.6 లక్షల జాబ్స్‌నూ కట్ చేయొచ్చని అంచనా వేసింది. ఆటోమేషన్‌తో 2025-2027 మధ్య $12.6B ఆదా అవుతాయని భావిస్తున్నట్లు తెలిపింది.
News October 21, 2025
త్వరలో 6వేల పోలీసు ఉద్యోగాలకు పోస్టింగ్స్: మంత్రి

AP: పోలీసు అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. తమ ప్రభుత్వం 6వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని, వారికి త్వరలో పోస్టింగ్స్ ఇస్తామని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో నియామకాలు జరగలేదని విమర్శించారు. మరోవైపు పోలీసు శాఖలో 11వేల ఖాళీలు ఉన్నాయని ఇదివరకే డీజీపీ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.