News October 21, 2025
NZB: ముగిసిన రియాజ్ అంత్యక్రియలు

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు మంగళవారం ఉదయం ముగిశాయి. బోధన్ రోడ్డులోని స్మశాన వాటికలో ముస్లిం సంప్రదాయ ప్రకారం ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు.
Similar News
News October 22, 2025
స్నేహబంధం కోసం సీపీ ఆలం.. HZBలో ఆకస్మిక సందర్శన

కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తన బ్యాచ్‌మేట్, ఐపీఎస్ అధికారి చింత కుమార్‌ను కలిసేందుకు హుజురాబాద్‌లోని పోతిరెడ్డిపేట గ్రామానికి ఆకస్మికంగా వచ్చారు. సెలవుపై స్వగ్రామంలో ఉన్న చింత కుమార్‌తో గౌష్ ఆలం ఆప్యాయంగా సమావేశమై, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉన్నత వృత్తి బాధ్యతల మధ్య కూడా వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇస్తూ సీపీ చేసిన ఈ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది.
News October 22, 2025
చిత్తూరు: పాఠశాలలకు సెలవు

రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. అలాగే రేపు పాఠశాలలకు సెలవులు సెలవులు ప్రకటిస్తూ ఎంఈవోలకు డీఈవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 22, 2025
ధర్మపురి డిగ్రీ కళాశాల మంజూరుకు సీఎంకు కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించారు. అనతంరం కృతజ్ఞతలు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.