News October 21, 2025

నాగర్‌ కర్నూల్‌లో పోలీసు అమరవీరుల ర్యాలీ

image

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ‘పోలీస్ అమరవీరులకు జోహార్’ అంటూ నినాదాలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువబోదని వారు పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

HYD: రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం: పొంగులేటి

image

రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక వర్షాలకు పత్తి దిగుబడి తగ్గిందని, పత్తి రైతులను ఆదుకుంటామని తెలిపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే అధికారులను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.

రేపు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కోనేరు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సహా తదితర ముఖ్య అంశాలపై సమీక్షించనున్నారు.