News October 21, 2025

సిరిసిల్ల: ‘పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం’

image

విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకమని బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు వారు నివాళులు అర్పించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ.. అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరని కొనియాడారు. వారి త్యాగాలు ఎన్నటికీ మరువలేనివి అన్నారు.

Similar News

News October 22, 2025

పొద్దున నిద్ర లేవగానే ఇలా చేస్తే.. అన్నీ శుభాలే!

image

ఉదయం నిద్ర లేవగానే కొన్నింటిని దర్శిస్తే ఆ రోజంతా శుభాలు కలుగుతాయి. అరచేతుల్లో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పొద్దున్నే వాటిని చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం.. తులసి మొక్కను చూస్తే, ముల్లోకాలలోని పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. గోవు, అగ్నిహోత్ర దర్శనం కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఈ నియమాలను పాటిస్తే.. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు.

News October 22, 2025

రైలు నుంచి జారిపడిన వ్యక్తి

image

మంత్రాలయం రైల్వే స్టేషన్ వద్ద తమిళనాడుకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి రెండు కాళ్లు పోయాయి. స్పందించిన రైల్వే పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బతుకుదెరువు కోసం సోలాపూర్ వెళ్లి తిరిగి మధురై వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.

News October 22, 2025

పరమ శివుడికి ఇష్టమైన మాసం

image

కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజులు పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. ఈ మాసంలో తెల్లవారుజామున నదీ స్నానాలు చేసి దేవాలయాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో తులసి కోట, దేవాలయాలు, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచిదని అంటున్నారు. కార్తీక మాస వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా అన్నదానం, వస్త్ర దానం, గోదానం చేస్తే పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.