News October 21, 2025
జనగామ జిల్లాలో 4.2 మి.మీ. వర్షపాతం

జనగామ జిల్లాలో గడచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. తరిగొప్పుల 3.2 మి.మీ., చిల్పూర్ 2.0, జఫర్గడ్ 7.6, స్టేషన్‌ఘన్పూర్ 2.8, రఘునాథపల్లి 9.6, నర్మెట 1.6, జనగామ 3.4, లింగాల ఘనపూర్ 2.0, దేవరుప్పుల 12.2, కొడకండ్ల 6.0, మొత్తం 4.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News October 22, 2025
భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!

వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్‌లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను దాదాపు 95% ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఆంక్షలతో ధరలు 10-15% మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5-6 నెలలు కొనసాగొచ్చని తెలుస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది.
News October 22, 2025
VZM: పండగ పేరిట పన్ను దోపిడీ?

విజయనగరం జిల్లాలో రెగ్యులర్ టాక్స్ పేయర్స్ అయిన పలువురు బాణసంచా వ్యాపారులు రికార్డుల్లో రూ.కోటి రిటర్న్ మాత్రమే చూపించి, రూ.4 కోట్ల టర్నోవర్‌ను దాచిపెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. లావాదేవీలు, అండర్-ఇన్వాయిసింగ్ ద్వారా GST స్వాహా చేస్తున్నారన్నారు. గోదాముల్లోని క్లోజింగ్ స్టాక్‌లో లక్షల విలువైన సరుకు లెక్కల్లో చూపడం లేదని, బోగస్ ITC క్లెయిమ్‌లు, E-Way బిల్ ఎగవేతలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
News October 22, 2025
అన్నమయ్య: భారీ వర్షాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08561- 293006కు కాల్ చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉండేలా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని మంత్రి పేర్కొన్నారు.