News October 21, 2025

MNCM: పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివి: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అసాంఘిక శక్తులతో పోరాడి అసువులు బాసిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద సీపీ అంబర్ కిషోర్ ఝా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివని అన్నారు. ప్రజలు, దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు.

Similar News

News October 22, 2025

పరవాడ సమీపంలో పేకాట శిబిరంపై దాడి: సీఐ

image

పరవాడ మండలం నక్కవానిపాలెం సమీపంలో పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సీఐ మల్లిఖార్జునరావు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకొని రూ.19 లక్షల నగదు, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొందరు వ్యక్తులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 22, 2025

విశాఖ: వీకెండ్‌లో ప్రత్యేక సర్వీసులు

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీ పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి ప్రతి శని,ఆదివారాల్లో ఈ సర్వీసులు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. లగ్జరీ, డీలక్స్, ఇంద్ర సర్వీసులకు సంబంధించి వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. మరిన్ని వివరాలకు డిపోలో సంప్రదించాలని అధికారులు కోరారు.

News October 22, 2025

48 మందికి మాత్రమే అనుమతి: పోలీసులు

image

మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియచేసేందుకు బుధవారం ఛలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో 48 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పాయకరావుపేట సీఐ అప్పన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాన్ని సందర్శించేందుకు పోలీసులను అనుమతి కోరిన 48 మందికి మాత్రమే అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలన్నారు.