News October 21, 2025

నలుగురి గురించి ఆలోచిస్తూ ఉంటే..!

image

నలుగురూ ఏమనుకుంటారో అని భయపడుతున్నారా? ఇది వ్యక్తిగత పురోగతికి ప్రధాన అడ్డంకి అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయం వల్ల అనేక వినూత్న ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాల్చక, మన మనసులోనే చనిపోతున్నాయని చెబుతున్నారు. దీని నుంచి బయటపడితేనే మనం పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలమని సూచిస్తున్నారు. సొంత ఆలోచనలపై నమ్మకముంచి, నిస్సంకోచంగా ముందుకు సాగడమే విజయానికి తొలిమెట్టు అని నిపుణులు తెలిపారు.

Similar News

News October 22, 2025

అక్టోబర్ 22: చరిత్రలో ఈరోజు

image

1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: సినీ నటుడు రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం

News October 22, 2025

గాజాలో చిన్నారికి ‘సింగపూర్’ పేరు.. కారణమిదే

image

కష్ట కాలంలో అన్నం పెట్టిన స్వచ్ఛంద సంస్థ పట్ల పాలస్తీనాకు చెందిన తల్లిదండ్రులు కృతజ్ఞతను చాటుకున్నారు. సింగపూర్‌కు చెందిన ‘లవ్ ఎయిడ్ సింగపూర్’ సంస్థ గాజాలో ఉచితంగా ఆహారం అందజేసింది. ఇందులో వంటమనిషిగా పనిచేసిన స్థానికుడైన హదాద్ ఇటీవల ఓ పాపకు తండ్రి అయ్యాడు. ఈ క్రమంలో తమకు అండగా నిలిచినందుకు బిడ్డకు ‘సింగపూర్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది.

News October 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.