News October 21, 2025

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: అనకాపల్లి కలెక్టర్

image

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. మంగళవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిస్వార్ధంగా పనిచేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం, నిబద్ధత కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు.

Similar News

News October 22, 2025

ఖమ్మం: తపాల శాఖ ఏజెంట్లకు.. దరఖాస్తుల ఆహ్వానం

image

తపాలా శాఖ బీమా పథకాలు పోస్టల్ జీవిత బీమా పీఎల్ గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్పీఎస్ఐ) లకు సంబంధించి కమీషన్ పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లు చేసి, 18 ఏళ్ల వయస్సు నిండిన నిరుద్యోగులు, గృహిణులు అంగన్వాడీ సేవకులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అర్హులని, ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 22, 2025

తిరుపతి జిల్లాలో కాలేజీలకు సెలవు

image

తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటించారు. తాజాగా కాలేజీలకు సైతం సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని స్కూళ్లకు సైతం హాలిడే ఇచ్చారు. ఆ జిల్లాలోని కాలేజీ సెలవులపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.

News October 22, 2025

GNT: వారు తడబడినా.. మనమే ఆత్మవిశ్వాసం నింపాలి.!

image

ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. గుంటూరు జిల్లాలో పెద్దలలో తడబడటం సుమారు 1% వరకు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. పిల్లల్లో మొదట్లో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే సమస్యను తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. స్పీచ్ థెరపిస్టులు తడబడే సహాయం చేస్తున్నప్పటికీ, నత్తి సమస్యతో బాధపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం ఈరోజు ప్రధాన ఉద్దేశం.