News October 21, 2025

జగిత్యాల: నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో SI వీరమరణం

image

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఎస్ఐగా పనిచేసిన క్రాంతి కిరణ్ తన సేవా కాలంలో ప్రజా భద్రత కోసం అహర్నిశలు కృషి చేశారు. విధి నిర్వహణలో ఎప్పుడూ ధైర్యంగా ముందుండే ఆయన, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచారు. తన విధుల్లో ఉన్న సమయంలో 1995 SEPT 29న రంగారావుపేటలో జరిగిన జనశక్తి నక్సల్స్ ఎన్‌కౌంటర్‌లో ఆయన అసువులు బాసారు. ఆయన ప్రాణత్యాగం ప్రజల మనసులో చెరగని ముద్ర వేసింది. SHARE IT.

Similar News

News October 22, 2025

అక్టోబర్ 22: చరిత్రలో ఈరోజు

image

1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: సినీ నటుడు రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం

News October 22, 2025

REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే?

image

2023 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. BRS నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ 64,212 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించగా ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు పొందారు.