News October 21, 2025
అమరుల త్యాగమే శాంతికి పునాది: KMR కలెక్టర్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగనిరతి వల్లే నేడు శాంతి, భద్రతలు నెలకొన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News October 21, 2025
సికింద్రాబాద్: ఆ ట్రైన్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు గోరఖ్‌పుర్ ట్రైన్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరం నుంచి గోరఖ్‌పుర్‌కు వీక్లీ ట్రైన్ ప్రయాణికులకు సేవలందించేది. అయితే నవంబర్ 28 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఈ రైలు (07075- 07076)ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు.

BREAKING: HYD: అల్కాపురి టౌన్‌షిప్‌లో యాక్సిడెంట్

HYD పుప్పాలగూడ పరిధి అల్కాపురి టౌన్‌షిప్‌లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే నవీన్, తన కుమారుడు కుశల జోయల్‌తో కలిసి వస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.