News October 21, 2025

ఎమ్మార్వో, ఆర్ఐ అక్రమాలపై విచారణ- అనిరుధ్ రెడ్డి

image

ఉదండాపూర్ ప్రాజెక్టులో భాగంగా గతంలో భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని MLA అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అప్పటి తాహశీల్దార్, ఆర్ఐ అక్రమాలపై ఫిర్యాదులను నేరుగా లేదా వాట్సాప్ నంబర్‌ 9392017899కు పంపించాలన్నారు. ప్రస్తుతం 23 మంది అక్రమార్కులకు నోటీసులు జారీ చేశామన్నారు. రూ.3.84 కోట్ల రికవరికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Similar News

News October 22, 2025

ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి భారతీయురాలు

image

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రీ పాల్‌. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్‌ యాత్ర చేపట్టి, 7 ప్రపంచరికార్డులు సృష్టించారు. హరిద్వార్‌ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్‌ బృందానికి నాయకత్వం వహించారు. పద్మశ్రీ, అర్జున అవార్డు, భారత్ గౌరవ్ అవార్డు, 1984లో పద్మభూషణ్, లక్ష్మీబాయి రాష్ట్రీయ సమ్మన్ మొదటి అవార్డు అందుకున్నారు.

News October 22, 2025

‘తెలంగాణ రైసింగ్ 2047’ సర్వేకు విశేష స్పందన: కలెక్టర్

image

‘తెలంగాణ రైసింగ్ 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ASF కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. ఇప్పటివరకు కేవలం తెలంగాణ నుంచే వివిధ ప్రాంతాల పౌరులు సర్వేలో పాల్గొని సమాచారాన్ని అందించారన్నారు. భారతదేశ స్వాతంత్ర్యానికి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి (2047) తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు చేపట్టడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News October 22, 2025

భద్రాద్రి: రాయితీ యంత్రాల కోసం.. రూ.4.50 కోట్లు

image

వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్రం రైతులకు రాయితీని ఇస్తుంది. దశాబ్ద కాలం తర్వాత భద్రాద్రి జిల్లాలోని అన్నదాతలకు రాయితీలు రానున్నాయి. జిల్లాలో మొత్తం 1,88,702 మంది రైతులు ఉండగా 5,91,714 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరానికి రూ.4.50 కోట్లు రాయితీ యంత్ర పరికరాల కోసం విడుదల అయ్యాయి. 5,594 పరికరాలను రైతులకు కేటాయించారు. ఇందులో SC, STలకు 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీపై పరికరాలు ఇవ్వనున్నారు.