News April 9, 2024

యాదాద్రి ఆలయంలోకి సెల్ఫోన్స్ నిషేధం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ ఏప్రిల్ 8న ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్టీరియల్ సిబ్బంది, మతపర సిబ్బంది, నాల్గో తరగతి సిబ్బంది, ఎస్పీఎఫ్, హోంగార్డ్స్, అవుట్ సోర్సింగ్, సిబ్బంది వారి సెల్ ఫోన్లు ఆలయంలోకి‌ తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Similar News

News July 10, 2025

NLG: ముందస్తుకు మురిసి.. ఇప్పుడేమో దిగులు!

image

ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్ణాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు నారు పోసుకున్నారు.

News July 10, 2025

NLG: ‘ఎంపీడీవోలు పనితీరును మెరుగు పరచుకోవాలి’

image

అన్ని ప్రభుత్వ పథకాలలో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధులు పెరగకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేనని అన్నారు.

News July 10, 2025

NLG: మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు

image

ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఎఫ్ఏలు, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.