News October 21, 2025

జగిత్యాల: ‘సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం’

image

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలలో మంగళవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి జ్ఞాపికలను అందజేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని SP, కలెక్టర్ హామీ ఇచ్చారు. పలువురు పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు .

Similar News

News October 22, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.

News October 22, 2025

VKB: ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా వదిలేసిన తండ్రి

image

వికారాబాద్ పట్టణంలో రాత్రి ఒంటరిగా ఉన్న ఇద్దరు ఆడపిల్లలను గుర్తించిన పోలీసులు చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బందికి అప్పగించారు. హైదరాబాద్ నుంచి కారులో వచ్చి ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద తండ్రి తమను వదిలి వెళ్లినట్లు పిల్లలు తెలిపారు. వారు గుర్‌దొడ్ల తమ అమ్మమ్మ ఊరు అని చెప్పారు. దీంతో అధికారులు పిల్లలను శిశుగృహకు తరలించారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు కోరారు.