News October 21, 2025
నస్రుల్లాబాద్: వృద్ధురాలి హత్య.. నగలు దోపిడీ (UPDATE)

నస్రుల్లాబాద్(M) అంకోల్ తండాలో <<18063585>>వృద్ధురాలి హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. రాధీ బాయి ఒంటరిగా నివసిస్తుంది. సోమవారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన సవాయిసింగ్ ఇంట్లోకి వెళ్లి రాధీ బాయిని గొడ్డలితో నరికి ఆమెపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీన్ని చూసిన లక్ష్మీ అనే మహిళ ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సవాయిసింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.
News October 22, 2025
VKB: ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా వదిలేసిన తండ్రి

వికారాబాద్ పట్టణంలో రాత్రి ఒంటరిగా ఉన్న ఇద్దరు ఆడపిల్లలను గుర్తించిన పోలీసులు చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బందికి అప్పగించారు. హైదరాబాద్ నుంచి కారులో వచ్చి ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద తండ్రి తమను వదిలి వెళ్లినట్లు పిల్లలు తెలిపారు. వారు గుర్‌దొడ్ల తమ అమ్మమ్మ ఊరు అని చెప్పారు. దీంతో అధికారులు పిల్లలను శిశుగృహకు తరలించారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు కోరారు.