News October 21, 2025

సిద్దిపేట: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

అక్కన్న పేట మండలంలోని అంతక్కపేట గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కె.హైమావతి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తేమశాతం రాగానే గన్నిలలో నింపి లారీలలో లోడ్ చేయాలని, సెంటర్‌లో అన్ని సౌకర్యాలు ఉండాలన్నారు. తూకంలో ఎలాంటి తేడా రావద్దని సెంటర్ సిబ్బందికి తెలిపారు. గన్ని బ్యాగులు ప్రతిరోజూ చెక్ చేసుకుని డ్యామేజ్ ఉంటే అధికారులకు రిపోర్ట్ చేయాలన్నారు.

Similar News

News October 22, 2025

సంగారెడ్డి: ‘పర్యాటక కేంద్రంగా మంజీరా’

image

మంజీరా తీరాన పర్యటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంజీర నది తీరంలో ప్రకృతి వైభవాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News October 22, 2025

మెదక్: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25న ముగుస్తుందన్నారు.

News October 22, 2025

ఐస్‌లాండ్‌లో కనిపించిన దోమలు

image

ఇందులో విడ్డూరం ఏముంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మంచు దేశానికి దోమలు లేని దేశంగా పేరుంది. తాజాగా వెస్టర్న్ ఐస్‌ల్యాండ్‌లోని ఓ అడవిలో ఈ దోమలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్నేళ్ల కిందట విమానంలో ఓ దోమను గుర్తించగా తాజాగా సహజ వాతావరణంలోనే ఈ కీటకాలను కనుగొన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ఎలా వచ్చాయనే విషయమై కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా ఇది మారిన వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది.