News October 21, 2025
ఆదోనిలో MPTCల కిడ్నాప్ కలకలం

ఆదోనిలో MPTC కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. బైచిగేరి MPTC నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య విజయలక్ష్మి తాలూకా పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. MPPపై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ MPTCలు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనెల 22న జరిగే అవిశ్వాస తీర్మానానికి వెళ్లకుండా తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. ఈయనతో పాటు మరో ముగ్గురు MPTCలను సైతం కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
Similar News
News October 22, 2025
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ఉత్సవం జరగనున్న నేపథ్యంలో రామ్‌కోటి, లింగంపల్లి, బర్కత్‌పూరా, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
News October 22, 2025
పేదల కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రభుత్వాధికారి కథ ఇది.!

1957 బ్యాచ్‌కు చెందిన IAS అధికారి S.R. శంకరన్ పేరుమీద మన గుంటూరు కలెక్టరేట్ ఒక కాన్ఫరెన్స్ హాలు ఉందని మీకు తెలుసా?. S.R శంకరన్ 1934, అక్టోబర్ 22న జన్మించారు. 1957లో IASగా ప్రస్థానం మొదలుపెట్టి, 1992లో పదవీ విరమణ చేశారు. ప్రజాసేవ కోసం పెళ్లి దూరంగా ఉన్నారు. తనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు దాన్ని తిరస్కరించడమే గాక, ఆ విషయం ప్రచురించవద్దని పత్రికా విలేకరులను ప్రాథేయపడ్డారు.