News October 21, 2025

నల్లుల బెడద.. గూగుల్ ఆఫీసు తాత్కాలికంగా మూత!

image

టెక్ దిగ్గజం గూగుల్‌కు అనుకోని సమస్య వచ్చింది. నల్లుల బెడదతో న్యూయార్క్‌లోని చెల్సియా క్యాంపస్‌ తాత్కాలికంగా మూతబడింది. దీంతో ఉద్యోగులు WFH చేయాలని మెయిల్ పెట్టింది. నల్లుల సమస్య పరిష్కారమయ్యే వరకు ఆఫీసుకు రావద్దని చెప్పినట్లు సమాచారం. ఈ నెల 19న నల్లుల నివారణ చర్యలు చేపట్టి, సోమవారం నుంచి ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిచ్చింది. 2010లోనూ గూగుల్ 9th అవెన్యూ ఆఫీసులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవడం గమనార్హం.

Similar News

News October 22, 2025

నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.

News October 22, 2025

కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

image

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.

News October 22, 2025

ఐస్‌లాండ్‌లో కనిపించిన దోమలు

image

ఇందులో విడ్డూరం ఏముంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మంచు దేశానికి దోమలు లేని దేశంగా పేరుంది. తాజాగా వెస్టర్న్ ఐస్‌ల్యాండ్‌లోని ఓ అడవిలో ఈ దోమలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్నేళ్ల కిందట విమానంలో ఓ దోమను గుర్తించగా తాజాగా సహజ వాతావరణంలోనే ఈ కీటకాలను కనుగొన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ఎలా వచ్చాయనే విషయమై కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా ఇది మారిన వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది.