News October 21, 2025

మధ్యలంకను ఫారెస్ట్ రిజర్వు ప్రాంతంగా ప్రకటిస్తాం.:DFO

image

బి.దొడ్డవరంలోని మధ్యలంకలో బిల్ స్టార్ట్ పక్షులు రూ.10 వేలు ఉంటాయని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అధికారి ప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారం బోర్డుపై వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అవి ఆగ్నేయ ఆసియా నుంచి వలస వచ్చిన పక్షులని చెప్పారు. నత్తలను కొట్టుకుని ఇవి తింటాయన్నారు. మూడేళ్లుగా ఇవి ఇక్కడే నివాసం ఉంటున్నాయన్నారు. వాటి పరిరక్షణకు ఆ ప్రాంతాన్ని ఫారెస్ట్ రిజర్వు ప్రాంతంగా ప్రకటిస్తామన్నారు.

Similar News

News October 22, 2025

WWC: పాక్ ఔట్.. భారత్‌లోనే సెమీస్, ఫైనల్

image

నిన్న సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఉమెన్స్ వరల్డ్ కప్ నుంచి పాక్ క్రికెట్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నాయి. పాక్ సెమీస్‌/ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ICC ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. ఇప్పుడు పాక్ ఇంటికెళ్లడంతో ఈనెల 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2న ఫైనల్ INDలోనే నిర్వహించనుంది.

News October 22, 2025

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. పత్తి ధర ఎంతంటే?

image

నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌లో గత వారంతో పోలిస్తే పెరిగింది. గత వారం క్వింటా పత్తి ధర రూ.6,930 పలకగా.. నేడు రూ.7,000 మార్క్ దాటి 7,010 అయ్యింది. నిన్న అర్ధరాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ ఆవరణలో కొంచెం బురదమైనప్పటికీ, ఉదయం నుంచి క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News October 22, 2025

నేడు బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడట

image

నేటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ నెలలో వచ్చే తొలి తిథిని బలి పాడ్యమి అంటారు. ఈ శుభదినాన బలి చక్రవర్తి భూలోకాన్ని చూడ్డానికి భూమ్మీదకు వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపినప్పుడు ప్రతి ఏడాది 3 రోజులు భూలోకాన్ని పాలించే వరం ఇస్తాడు. ఆ 3 రోజుల్లో ఇదొకటి. నేడు దాన గుణుడైన బలిని స్మరిస్తూ, భక్తులు తమ ఇళ్లను దీపాలతో అలంకరించి, దానధర్మాలు చేస్తారు.