News October 21, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

➢ రేపు ఉ.11.07 గంటలకు ప్రభాస్-హను రాఘవపూడి సినిమా టైటిల్ టీజ్, ఎల్లుండి ఉ.11.07 గంటలకు టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్
➢ వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి సినిమా?: సినీ వర్గాలు
➢ ‘డ్యూడ్’ మూవీకి 4 రోజుల్లో ₹83Cr+ గ్రాస్ కలెక్షన్స్
➢ ‘K Ramp’కి 3 రోజుల్లో ₹17.5Cr+ గ్రాస్ వసూళ్లు
➢ ‘తెలుసు కదా’ మూవీకి 4 రోజుల్లో ₹16.3Cr+ గ్రాస్ కలెక్షన్స్

Similar News

News October 22, 2025

WWC: పాక్ ఔట్.. భారత్‌లోనే సెమీస్, ఫైనల్

image

నిన్న సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఉమెన్స్ వరల్డ్ కప్ నుంచి పాక్ క్రికెట్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నాయి. పాక్ సెమీస్‌/ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ICC ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. ఇప్పుడు పాక్ ఇంటికెళ్లడంతో ఈనెల 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2న ఫైనల్ INDలోనే నిర్వహించనుంది.

News October 22, 2025

నేడు బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడట

image

నేటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ నెలలో వచ్చే తొలి తిథిని బలి పాడ్యమి అంటారు. ఈ శుభదినాన బలి చక్రవర్తి భూలోకాన్ని చూడ్డానికి భూమ్మీదకు వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపినప్పుడు ప్రతి ఏడాది 3 రోజులు భూలోకాన్ని పాలించే వరం ఇస్తాడు. ఆ 3 రోజుల్లో ఇదొకటి. నేడు దాన గుణుడైన బలిని స్మరిస్తూ, భక్తులు తమ ఇళ్లను దీపాలతో అలంకరించి, దానధర్మాలు చేస్తారు.

News October 22, 2025

వంటింటి చిట్కాలు

image

– బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్‌లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
– బాగా పండిన టమాటాలను ఉప్పు నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికి తాజాగా ఉంటాయి.
– కాకరకాయ కూరలో సొంపు గింజలు లేదా బెల్లం వేస్తే కూర చేదు తగ్గుతుంది.
– ఫర్నిచర్, వంట పాత్రలపై ఉండే స్టిక్కర్లను ఈజీగా తీయడానికి దాని మీద నూనె వేసి రుద్ది, పావుగంటయ్యాక సబ్బుతో కడిగితే సరిపోతుంది.