News October 21, 2025

MHBD: కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు

image

MHBD జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలకు ఆగ్మార్క్‌ నియమాల ప్రకారం కోడిగుడ్లు సరఫరా చేసేందుకు టెండర్లు తీసుకుని ఖరారు చేస్తామని షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కే శ్రీనివాస్ తెలిపారు. డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, మహబూబాబాద్ పేరు మీద డీడీ చెల్లించాలన్నారు. టెండరును http://tender.telangana.gov.inలో మాత్రమే దాఖలు చేయాలని సూచించారు.

Similar News

News October 22, 2025

జనగామ: విద్యాశాఖ నిబంధనలు బేఖాతరు

image

విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా బోధకుల్లో మార్పు రావడం లేదు. గతంలో పాఠశాలల్లో బోధకులు సెల్ ఫోన్ వినియోగించరాదని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. తరగతి గదుల్లోనే గంటల తరబడి సెల్ ఫోన్లలో తమ వ్యాపార ముచ్చట్లు చెప్పుకుంటూ విద్యకు శఠగోపం పెడుతున్నారు. జనగామ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఈ తంతు జరుగుతోంది.

News October 22, 2025

రౌడీ చనిపోతే మానవహక్కులు గుర్తుకొస్తాయా?.. VHP ఫైర్

image

TG: NZBలో కానిస్టేబుల్‌ను చంపిన రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించడంపై మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై విశ్వహిందూ పరిషత్ ఫైరైంది. ‘పోలీసులు మరణిస్తే లేని మానవహక్కులు ఓ రౌడీ చనిపోతే గుర్తుకొస్తాయా? నేరస్థులకు మరింత ప్రోత్సాహమిచ్చేలా మాట్లాడటం హంతకులకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లే అవుతుంది’ అని మండిపడింది. జిహాదీ మూకలకు ఇదే రీతిలో జవాబివ్వాలని పోలీసులను కోరింది.

News October 22, 2025

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కామారెడ్డి జిల్లాలో రాత్రిపూట చలి ప్రభావం పెరిగింది. పల్వంచ మండలంలో 34.3 సెంటిగ్రేడ్, బాన్సవాడలో 33.7, గాంధారి, మద్నూర్ 33.5, బిచ్కుంద 33,1, దోమకొండలో 32.9 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యియి. అత్యల్పంగా తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లో 31.4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది. చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.