News October 21, 2025
BRS స్టార్ క్యాంపెనయిర్లుగా ఉమ్మడి వరంగల్ నేతలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా BRS స్టార్ క్యాంపెనయిర్లను నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్యాంపెనయిర్లుగా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Similar News
News October 22, 2025
జనగామ: విద్యాశాఖ నిబంధనలు బేఖాతరు

విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా బోధకుల్లో మార్పు రావడం లేదు. గతంలో పాఠశాలల్లో బోధకులు సెల్ ఫోన్ వినియోగించరాదని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. తరగతి గదుల్లోనే గంటల తరబడి సెల్ ఫోన్లలో తమ వ్యాపార ముచ్చట్లు చెప్పుకుంటూ విద్యకు శఠగోపం పెడుతున్నారు. జనగామ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఈ తంతు జరుగుతోంది.
News October 22, 2025
రౌడీ చనిపోతే మానవహక్కులు గుర్తుకొస్తాయా?.. VHP ఫైర్

TG: NZBలో కానిస్టేబుల్‌ను చంపిన రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మరణించడంపై మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై విశ్వహిందూ పరిషత్ ఫైరైంది. ‘పోలీసులు మరణిస్తే లేని మానవహక్కులు ఓ రౌడీ చనిపోతే గుర్తుకొస్తాయా? నేరస్థులకు మరింత ప్రోత్సాహమిచ్చేలా మాట్లాడటం హంతకులకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లే అవుతుంది’ అని మండిపడింది. జిహాదీ మూకలకు ఇదే రీతిలో జవాబివ్వాలని పోలీసులను కోరింది.
News October 22, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

కామారెడ్డి జిల్లాలో రాత్రిపూట చలి ప్రభావం పెరిగింది. పల్వంచ మండలంలో 34.3 సెంటిగ్రేడ్, బాన్సవాడలో 33.7, గాంధారి, మద్నూర్ 33.5, బిచ్కుంద 33,1, దోమకొండలో 32.9 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యియి. అత్యల్పంగా తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లో 31.4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది. చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.