News October 21, 2025
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: రాచకొండ సీపీ

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అంబర్‌పేట్ కార్ హెడ్‌క్వార్టర్‌లో సీపీ సుధీర్ బాబు, డీసీపీలు, సీనియర్ అధికారులతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని తెలిపారు.
Similar News
News October 22, 2025
పరమ శివుడికి ఇష్టమైన మాసం

కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజులు పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. ఈ మాసంలో తెల్లవారుజామున నదీ స్నానాలు చేసి దేవాలయాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో తులసి కోట, దేవాలయాలు, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచిదని అంటున్నారు. కార్తీక మాస వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా అన్నదానం, వస్త్ర దానం, గోదానం చేస్తే పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
News October 22, 2025
కార్తీక మాసంలో దీపాల విశిష్ఠత

కార్తీక మాసంలో సూర్యుడు తుల-వృశ్చిక రాశుల్లో, చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో సూర్యకాంతి తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వగా అవుతూ చీకటి దట్టంగా ఉంటుంది. అప్పుడు మన శరీరమూ కాస్త బద్దకిస్తుంది. చీకట్లను పారదోలడంతోపాటు మన శక్తి పుంజుకునేందుకు దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించడం శుభప్రదమంటున్నారు.
News October 22, 2025
Congratulations మేఘన

పెద్దకడబూరు జడ్పీ పాఠశాలలో చదివే 9వ తరగతి విద్యార్థిని మేఘన ‘క్వాంటం ఏజ్ బిగిన్స్-పొటెన్షియల్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి సెమినార్‌లో ప్రతిభ చాటారు. ఈ మేరకు ప్రశంసా పత్రం, మెడల్ మంగళవారం హెచ్ఎం ఉమా రాజేశ్వరమ్మ చేతుల మీదుగా మేఘనకు అందజేశారు. మనమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నామని, కాబట్టి విద్యార్థులు క్వాంటం మెకానిక్స్ అనే అంశంపై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు.