News October 21, 2025
పాక్ ODI కెప్టెన్‌గా రిజ్వాన్ తొలగింపు.. కారణం ఇదేనా?

పాక్ ODI కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ స్థానంలో షహీన్ అఫ్రీదిని నియమించిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడానికి నిరాకరించినందుకే రిజ్వాన్‌ను తొలగించినట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు బెట్టింగ్ యాప్స్ లోగో ఉన్న జెర్సీని ధరించడానికి ఒప్పుకోలేదు. మరోవైపు పాలస్తీనా మద్దతుగా చేసిన వ్యాఖ్యలూ ప్రభావం చూపాయని సమాచారం.
Similar News
News October 22, 2025
542 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) 542 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వెహికల్ మెకానిక్, MSW(పెయింటర్, DES)పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగలవారు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. PET, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bro.gov.in/
News October 22, 2025
గుడ్ న్యూస్.. ట్రేడ్ డీల్ దిశగా ఇండియా, అమెరికా

భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అతి త్వరలోనే కుదిరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వాణిజ్య చర్చల్లో పురోగతి సాధించినట్లు సమాచారం. ఒకవేళ ఒప్పందం కుదిరితే ప్రస్తుతం 50 శాతంగా ఉన్న టారిఫ్స్ 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కాగా రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి <<18044575>>పీయూష్ <<>>గోయల్ చెప్పిన విషయం తెలిసిందే.
News October 22, 2025
WWC: పాక్ ఔట్.. భారత్‌లోనే సెమీస్, ఫైనల్

నిన్న సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ఉమెన్స్ వరల్డ్ కప్ నుంచి పాక్ క్రికెట్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నాయి. పాక్ సెమీస్/ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ICC ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. ఇప్పుడు పాక్ ఇంటికెళ్లడంతో ఈనెల 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2న ఫైనల్ INDలోనే నిర్వహించనుంది.