News October 21, 2025

అమలాపురం: PM ఆదర్శ యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష

image

మధ్యలో నిలిచిన పీఎం ఆదర్శ గ్రామ యోజన గ్రామ అభివృద్ధి ప్రణాళికలలో సౌకర్యవంతంగా ఉన్న పనులకు నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అవసరంలేని పనులకు కేటాయించిన నిధులు వేరే పనులకు కేటాయించాలని చెప్పారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో పీఎం ఆవాస్ యోజన మొదటి రెండు దశల గ్రామాభివృద్ధి ప్రణాళికలపై DLDO, ఎంపీడీవోలతో సమీక్ష జరిపారు. 40% పైబడి ఎస్సీలు ఉన్న ప్రాంతానికి పథకం ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News October 22, 2025

SECLలో 1,138 పోస్టులు.. అప్లై చేశారా?

image

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL) 1,138 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. Asst ఫోర్‌మెన్(543 ), మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్(595) పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్ జాబ్‌లకు OCT 30 అప్లైకి ఆఖరు తేదీ కాగా.. Asst ఫోర్‌మెన్ పోస్టులకు NOV 9 లాస్ట్ డేట్. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి.
*మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 22, 2025

తొర్రూరు: మెడికల్ షాపులపై పోలీసుల దాడులు

image

తొర్రూరులో మెడికల్ షాప్‌పై మంగళవారం పోలీసులు దాడులు చేశారు. ఓ మెడికల్ షాప్ యజమానిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే 1,296 స్పాస్మో ప్రాక్సీవాన్ ప్లస్, 345 ట్రామడాల్ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకొని NDPS చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు పదార్థాల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివరాంరెడ్డి హెచ్చరించారు.

News October 22, 2025

గూగుల్ క్రోమ్‌కు పోటీగా ‘అట్లాస్’

image

గూగుల్ క్రోమ్‌కు పోటీగా OpenAI ‘అట్లాస్’ అనే సొంత వెబ్ బ్రౌజర్‌ను లాంచ్ చేసింది. AI చాట్‌బాట్ ChatGPT ద్వారా వరల్డ్‌లో మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్‌గా OpenAI ఎదిగింది. ఇప్పుడు యూజర్లను పెంచుకుని డిజిటల్ అడ్వర్టైజింగ్ ద్వారా రెవెన్యూ ఆర్జించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం యాపిల్ ల్యాప్‌టాప్స్‌లో ‘అట్లాస్‌’ను లాంచ్ చేయగా త్వరలో మైక్రోసాఫ్ట్ విండోస్, యాపిల్ iOS, ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి రానుంది.