News October 21, 2025
‘NITI’ తీరుతో ప్రమాదంలో 113 సిటీలు: పర్యావరణ వేత్తలు

CRZ రిస్ట్రిక్షన్స్‌ను 500 నుంచి 200 మీటర్లకు కుదించాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును తిరస్కరించాలని పర్యావరణవేత్తలు PMకి విన్నవించారు. ‘సముద్ర మట్టం పెరుగుదల వల్ల 2050కు దేశంలోని 113 సిటీలు మునిగిపోతాయని INDIA డవలప్మెంటు రిపోర్టు చెబుతోంది. ప్రస్తుత రూలే కాలం చెల్లగా, ఇంకా కుదించడం మరింత ప్రమాదం’ అని పేర్కొన్నారు. సీ లెవెల్ 91MM పెరిగిందని, ముంపు వంటి ఉపద్రవాలపై నాసా హెచ్చరించిందని గుర్తుచేశారు.
Similar News
News October 22, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.
News October 22, 2025
అందుకే అలా మాట్లాడా: నిర్మాత రాజేశ్

నిన్న ఓ వెబ్‌సైట్‌పై <<18065234>>ఫైరయిన<<>> ‘K RAMP’ నిర్మాత రాజేశ్ దండా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘రేటింగ్ ఇవ్వడంపై అభ్యంతరం లేదు. కానీ ఆదరణ పెరిగాక నెగటివ్ వార్తలు రాయడం బాధించింది. నేను వాడిన భాష అభ్యంతరకరం అంటున్నారు. రూ.కోట్లు ఖర్చుచేసిన నా సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడా. సినీ జర్నలిస్టులంటే నాకు ఎప్పుడూ గౌరవమే’ అని ట్వీట్ చేశారు.
News October 22, 2025
కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ సమీక్ష

TG: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యూహం, ప్రచార సరళి గురించి ఆయనకు కేటీఆర్, హరీశ్‌రావు వివరిస్తున్నారు. రేపు జరగనున్న బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జుల సమావేశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.