News October 21, 2025
నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో ఉద్యోగాలు

నేవీ చిల్డ్రన్ స్కూల్ 8 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, డిప్లొమాతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 21 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్ క్లాస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్‌సైట్: https://ncsdelhi.nesnavy.in/
Similar News
News October 22, 2025
అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇవాళ నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరుపతి, కడప, ప్రకాశంలోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అక్కడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
News October 22, 2025
తెలంగాణ రౌండప్

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు 280కిపైగా నామినేషన్లు దాఖలు. ఇవాళ నామినేషన్లను పరిశీలించనున్న అధికారులు.. ఉపసంహరణకు 24వరకు గడువు
* ఈ నెల 25లోపు ‘తెలంగాణ రైజింగ్’ సర్వేలో పాల్గొనాలన్న ప్రభుత్వం.. ఇప్పటికే 3 లక్షల మంది పాల్గొన్నారని వెల్లడి
* రేపు మంత్రివర్గ భేటి. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై చర్చ
* ఎప్‌సెట్ బైపీసీ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి.. బీ ఫార్మసీలో 96.67% మందికి సీట్లు అలాట్.
News October 22, 2025
కార్తీకం: ఆకాశ దీపం అంటే?

కార్తీక మాసంలో దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ ఏర్పాటుచేస్తారు. చిన్న రంధ్రాలున్న ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇంటి దగ్గర తులసికోట పక్కన పొడవైన కొయ్యదీప స్తంభానికి దీపాన్ని వెలిగిస్తారు. దీని వెలిగించడం వల్ల అపార జ్ఞానం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆకాశ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని, దీనివల్ల వారు దివ్యలోకాలను పొందుతారని వివరిస్తున్నాయి.