News April 9, 2024
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
వేసవి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు 48 స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు ద.మ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్-నాగర్‌సోల్ (07517), నాగర్‌సోల్-సికింద్రాబాద్ (07518), తిరుపతి-మచిలీపట్నం (07121), మచిలీపట్నం-తిరుపతి (07122), CST ముంబై-కరీంనగర్ (01067), కరీంనగర్-CST ముంబై (01068), యశ్వంత్‌పూర్-కాలాబుర్గి(06505), కాలాబుర్గి-యశ్వంత్‌పూర్ (06506) మధ్య నడుస్తాయని తెలిపింది.
Similar News
News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’ రివ్యూ&రేటింగ్
నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే ‘గేమ్ ఛేంజర్’ స్టోరీ. సామాజిక కార్యకర్తగా, IASగా రామ్ చరణ్ మెప్పించారు. SJ సూర్య యాక్టింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్. BGM పర్వాలేదు. ‘జరగండి జరగండి..’ సాంగ్ ఆకట్టుకుంటుంది. రొటీన్ స్టోరీ, మాస్ ఎలివేషన్ సీన్స్ లేకపోవడం మైనస్. కామెడీ వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ ఫైట్ బోర్ తెప్పిస్తుంది. డైరెక్టర్ శంకర్ మార్క్ పాటలకే పరిమితమైంది.
RATING: 2.5/5
News January 10, 2025
20 కోచ్‌లతో విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జనవరి 11 నుంచి 20 కోచ్‌లతో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 18 చెయిర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌లో 16 కోచ్‌లు ఉన్నాయి. ఈ ట్రైన్ ఉ.5.45 గంటలకు విశాఖ నుంచి, మ.3 గం.కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.
News January 10, 2025
ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలి: సీఎం
TG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని అధికారులు వివరించగా, వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.