News April 9, 2024
కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు తీర్పు
ఎక్సైజ్ పాలసీ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పును వెల్లడించనున్నారు. ఈనెల 3న ఈడీ, కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 13, 2025
PHOTOS: కుంభమేళాలో భక్తజన సంద్రం
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇవాళ్టి నుంచి 45 రోజులపాటు కుంభమేళా కొనసాగనుంది. భూ మండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా దీనిని పేర్కొంటారన్న సంగతి తెలిసిందే.
News January 13, 2025
IPL: ఆ జట్టుకు 17 మంది కెప్టెన్లు
IPL చరిత్రలో ఎక్కువ మంది కెప్టెన్లు మారిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టుకు 17 మంది సారథులు వచ్చారు. అందులో యువరాజ్, సంగక్కర, జయవర్దనే, గిల్‌క్రిస్ట్, డేవిడ్ హస్సీ, బెయిలీ, సెహ్వాగ్, మిల్లర్, మురళీ విజయ్, మ్యాక్స్ వెల్, రవిచంద్రన్ అశ్విన్, KL రాహుల్, మయాంక్ అగర్వాల్, ధవన్, సామ్ కరన్, జితేశ్ శర్మ ఉన్నారు. కానీ ఆ టీమ్ ఒక్క కప్పు కూడా కొట్టలేదు. తాజాగా శ్రేయస్ కెప్టెన్ అయ్యారు.
News January 13, 2025
కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే <<15137555>>కౌశిక్ రెడ్డిపై<<>> 3 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని, సమావేశంలో గందరగోళం సృష్టించారని ఆర్డీవో, గ్రంథాలయ ఛైర్మన్, సంజయ్ పీఏ వేర్వేరుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు 3 కేసులను నమోదు చేశారు. నిన్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సందర్భంగా ‘నీది ఏ పార్టీ?’ అంటూ సంజయ్‌ను కౌశిక్ నిలదీయడంతో తోపులాట జరిగిన సంగతి తెలిసిందే.