News October 21, 2025

పెద్దపల్లి: ఉమ్మడి జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభం

image

పెద్దపల్లిలోని రిక్రియేషన్‌ క్లబ్‌లో 69వ SGF కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా స్థాయి 14 సంవత్సరాల బాలబాలికలకు చదరంగ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. SGF జిల్లా కార్యదర్శి K.లక్ష్మణ్‌ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు కరీంనగర్‌, పెదదపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలోని 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు వచ్చే నెల రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.

Similar News

News October 22, 2025

ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం వాయిదా

image

ఆదోని మండల ఎంపీపీ దానమ్మపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వాయిదా పడింది. 28 ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం 17 మంది మద్దతు అవసరమని అధికారులు స్పష్టం చేశారు. తీర్మానానికి అవసరమైన సంఖ్య లేని కారణంగా అధికారులు అవిశ్వాసాన్ని వాయిదా వేశారు. కొన్ని రోజులుగా ఆదోనిలో ఎంపీపీ అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠ ఇక్కడితో శాంతించింది. ఎంపీపీగా దానమ్మ కొనసాగనున్నారు.

News October 22, 2025

జైషే మహ్మద్ మరో కుట్ర?

image

పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏర్పాటైన <<17958042>>మహిళా వింగ్ <<>>కోసం రిక్రూట్‌మెంట్, నిధులు సేకరించేందుకు ఆన్‌లైన్ జిహాదీ కోర్స్ ప్రారంభించినట్లు సమాచారం. జైషే చీఫ్ మసూద్ సిస్టర్స్ సాదియా, సమైరా, మరికొందరు రోజూ 40నిమిషాలు పాఠాలు చెప్తారని తెలుస్తోంది. ఇందులో పాల్గొనేవారు 500 పాక్ రుపీస్ డొనేషన్ ఇవ్వాలంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

News October 22, 2025

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించారా?

image

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. నవంబర్ 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. పాడిరైతులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.