News October 21, 2025
వాటర్ గ్రిడ్ పైపులపై నివేదికను అందించాలి: కలెక్టర్

మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన ధవళేశ్వరం వద్ద నుంచి కోనసీమ ప్రాంతానికి వాటర్ పైపుల ఏర్పాటుకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులు ఆదేశించారు. మంగళవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను ఈ పథకంపై దిశా నిర్దేశం చేశారు. రూ.1650 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ పథకంలో పనులు చేపట్టామన్నారు.
Similar News
News October 22, 2025
ఏయూ: ఈనెల 29న న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్

ఏయూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో పిజి-ఎల్ఎల్ఎం కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు ఈనెల 29న కౌన్సిలింగ్ జరగనుంది. 5ఏళ్ల ఎల్.ఎల్.బి, మూడేళ్ల ఎల్.ఎల్.బి, రెండేళ్ల పిజి-ఎల్ఎల్ఎం కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు కల్పిస్తున్నట్లు సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి పెదవాల్తేరులోని ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో కౌన్సిలింగ్ జరగనుందన్నారు.
News October 22, 2025
GNT: మంచు మొదలైంది బాసు.. జాగ్రత్తగా నడుపు.!

కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉదయం చలితోపాటు మంచు మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పక్కన ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఉండటంతో, ప్రయాణం చేసే వారికి జాగ్రత్త అవసరం. మంచు పెరగడంతో దారులు కనబడటం కష్టతరం కావచ్చు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగిస్తూ, రోడ్ల పరిస్థితిని గమనిస్తూ ప్రయాణించాలి. జాగ్రత్త మీ వేగం మీ కుటుంబానికే కాదు.. మరో కుటుంబానికి కూడా దుఃఖాన్ని మిగులుస్తుంది.
News October 22, 2025
2,570 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

RRB 2,570 ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in