News October 21, 2025

జూబ్లీహిల్స్: అనుమానమొస్తే అబ్జర్వర్లకు ఫిర్యాదు చేయవచ్చు!

image

జూబ్లీహిల్స్ బైపోల్స్ పరిశీలనకు ఈసీ అబ్జర్వర్లను నియమించింది. ముగ్గురు సీనియర్ అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, శాంతిభద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియజేయవచ్చు. జనరల్ అబ్జర్వర్: 92475 05728, పోలీస్ అబ్జర్వర్: 92475 05729, ఎక్స్ పెండేచర్ అబ్జర్వర్: 92475 05727 నంబర్లకు కాల్ చేయొచ్చు.

Similar News

News October 22, 2025

మంజీరా నుంచి HYDకి కొత్త పైప్ లైన్

image

ఆరు దశాబ్దాల కిందటి మంజీరా పైప్‌లైన్ల నుంచి 20 శాతం నీరు లీకేజీల ద్వారా వృథా అవుతోంది. ఈ నీటి నష్టాన్ని అరికట్టడానికి జలమండలి సిద్ధమైంది. ఈ మేరకు రూ.722 కోట్ల వ్యయంతో కొత్త పైప్‌లైన్ వేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.

News October 22, 2025

చర్లపల్లి – దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

పండుగల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, దానాపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 23, 28 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్ (07049), 24, 29 తేదీల్లో దానాపూర్ నుంచి చర్లపల్లి (07092) రైళ్లు నడుస్తాయి. అలాగే, 26న 07049, 27న 07050 నంబరు గల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.

News October 22, 2025

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

హైదరాబాద్‌లో నేడు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ఉత్సవం జరగనున్న నేపథ్యంలో రామ్‌కోటి, లింగంపల్లి, బర్కత్‌పూరా, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.