News October 21, 2025
జూబ్లీహిల్స్: అనుమానమొస్తే అబ్జర్వర్లకు ఫిర్యాదు చేయవచ్చు!

జూబ్లీహిల్స్ బైపోల్స్ పరిశీలనకు ఈసీ అబ్జర్వర్లను నియమించింది. ముగ్గురు సీనియర్ అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, శాంతిభద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియజేయవచ్చు. జనరల్ అబ్జర్వర్: 92475 05728, పోలీస్ అబ్జర్వర్: 92475 05729, ఎక్స్ పెండేచర్ అబ్జర్వర్: 92475 05727 నంబర్లకు కాల్ చేయొచ్చు.
Similar News
News October 22, 2025
పరవాడ సమీపంలో పేకాట శిబిరంపై దాడి: సీఐ

పరవాడ మండలం నక్కవానిపాలెం సమీపంలో పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సీఐ మల్లిఖార్జునరావు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకొని రూ.19 లక్షల నగదు, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొందరు వ్యక్తులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News October 22, 2025
విశాఖ: వీకెండ్‌లో ప్రత్యేక సర్వీసులు

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీ పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి ప్రతి శని,ఆదివారాల్లో ఈ సర్వీసులు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. లగ్జరీ, డీలక్స్, ఇంద్ర సర్వీసులకు సంబంధించి వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. మరిన్ని వివరాలకు డిపోలో సంప్రదించాలని అధికారులు కోరారు.
News October 22, 2025
48 మందికి మాత్రమే అనుమతి: పోలీసులు

మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియచేసేందుకు బుధవారం ఛలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో 48 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పాయకరావుపేట సీఐ అప్పన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాన్ని సందర్శించేందుకు పోలీసులను అనుమతి కోరిన 48 మందికి మాత్రమే అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలన్నారు.