News October 21, 2025
ములుగు: ఈ ఘటనకు 25 ఏళ్లు..!

ఏటూరునాగారంలోని పోలీస్ స్టేషన్‌ను 2001లో పేల్చివేత ఘటనలో మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ మందు పాత్రలు పెట్టి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులతో పాటు.. ఒక అటవీ అధికారి, పూజారి మృతి చెందాడు. ఆ సమయంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ విరోచితంగా పోరాడి నక్సల్స్ దాడిని ఎదురించారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. SHARE
Similar News
News October 22, 2025
పరవాడ సమీపంలో పేకాట శిబిరంపై దాడి: సీఐ

పరవాడ మండలం నక్కవానిపాలెం సమీపంలో పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సీఐ మల్లిఖార్జునరావు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకొని రూ.19 లక్షల నగదు, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొందరు వ్యక్తులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News October 22, 2025
విశాఖ: వీకెండ్‌లో ప్రత్యేక సర్వీసులు

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీ పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి ప్రతి శని,ఆదివారాల్లో ఈ సర్వీసులు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. లగ్జరీ, డీలక్స్, ఇంద్ర సర్వీసులకు సంబంధించి వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. మరిన్ని వివరాలకు డిపోలో సంప్రదించాలని అధికారులు కోరారు.
News October 22, 2025
48 మందికి మాత్రమే అనుమతి: పోలీసులు

మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియచేసేందుకు బుధవారం ఛలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో 48 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పాయకరావుపేట సీఐ అప్పన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాన్ని సందర్శించేందుకు పోలీసులను అనుమతి కోరిన 48 మందికి మాత్రమే అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలన్నారు.