News October 21, 2025

అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

అన్నమయ్య జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. అలాగే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే 08561-293006 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.

News October 22, 2025

‘కార్తీక మాసం’ అనే పేరెందుకు?

image

నక్షత్ర గమనం ఆధారంగా ఈ మాసానికి కార్తీక మాసం అనే దివ్య నామం సిద్ధించింది. శరదృతువులో వచ్చే ఈ పుణ్య మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు ఆకాశంలో కృత్తికా నక్షత్రం వద్ద సంచరిస్తాడు. అందువల్లే ఈ మాసానికి ‘కార్తీక’ అని పేరు వచ్చింది. తెలుగు మాసాలలో ఈ మాసం అతి పవిత్రమైనది. ‘న కార్తీక నమో మాసః’ అంటే కార్తీకానికి సమానమైన మాసం లేదని పురాణాలు కీర్తిస్తున్నాయి. శివకేశవుల అనుగ్రహం పొందడానికి ఈ మాసం ఉత్తమమైనది.

News October 22, 2025

రాఘవేంద్ర స్వామిని దర్శించిన మంత్రులు

image

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బుధవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, మంత్రి వాకిటి శ్రీహరి కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అంతకుముందు మాంచాలమ్మ ఆలయంలో కార్తిక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు.