News October 21, 2025
REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో 1,374 మంది నోటాకు ఓటేశారు!

2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసిన 19 మందిని 1,374 మంది ఓటర్లు తిరస్కరించారు. అంటే వీరంతా NOTA (None of The Above)కు ఓటు వేశారన్న మాట. ఇదిలా ఉండగా వెయ్యి ఓట్లలోపు ఇద్దరు అభ్యర్థులు సాధించగా 500లోపు ఇద్దరు, 200లోపు ఆరుగురు, ఐదుగురు 100లోపు ఓట్లు సాధించారు. ఆనందరావు అనే ఇండిపెండెంట్ అభ్యర్థి 53 ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.
News October 22, 2025
‘కార్తీక మాసం’ అనే పేరెందుకు?

నక్షత్ర గమనం ఆధారంగా ఈ మాసానికి కార్తీక మాసం అనే దివ్య నామం సిద్ధించింది. శరదృతువులో వచ్చే ఈ పుణ్య మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు ఆకాశంలో కృత్తికా నక్షత్రం వద్ద సంచరిస్తాడు. అందువల్లే ఈ మాసానికి ‘కార్తీక’ అని పేరు వచ్చింది. తెలుగు మాసాలలో ఈ మాసం అతి పవిత్రమైనది. ‘న కార్తీక నమో మాసః’ అంటే కార్తీకానికి సమానమైన మాసం లేదని పురాణాలు కీర్తిస్తున్నాయి. శివకేశవుల అనుగ్రహం పొందడానికి ఈ మాసం ఉత్తమమైనది.
News October 22, 2025
రాఘవేంద్ర స్వామిని దర్శించిన మంత్రులు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బుధవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, మంత్రి వాకిటి శ్రీహరి కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అంతకుముందు మాంచాలమ్మ ఆలయంలో కార్తిక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు.