News October 21, 2025
జూబ్లీహిల్స్‌లో పోటెత్తిన నామినేషన్లు..!

HYDజూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా క్యూలో 100కు పైగా నామినేషన్ల సెట్లు ఉన్నాయి. ఈరోజు సా.6.30 వరకు మొత్తం 80 దాఖలయ్యాయి. సా.3లోపు ఆర్వో ఆఫీస్ లోపలికి వెళ్లిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఒక్కో నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తుండడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.ఈరోజు చివరి తేదీ కావడంతో అభ్యర్థులు పోటెత్తారు.
Similar News
News October 22, 2025
కొత్తకోట: రెండు వాహనాలు ఢీ.. 8 మందికి గాయాలు

కొత్తకోట మండలం నాటవెల్లి-ముమ్మాలపల్లి గ్రామాల మధ్య NH- 44 పై బొలెరో, తుఫాన్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదు నుంచి పెబ్బేరు వైపు ప్రయాణికులతో వెళుతున్న తుఫాన్, కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరోను ఢీకొంది. క్షతగాత్రుల్ని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News October 22, 2025
రాణీ అహల్యాబాయి.. అందరికీ ఆదర్శం

మాల్వాను పాలించిన రాణీ అహల్యాబాయి హోల్కర్ ఆదర్శ పాలకుల్లో ఒకరు. 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో భర్త ఖండేరావు, 1767లో కుమారుడు మలేరావు మరణించడంతో 1795 వరకు ఇండోర్‌ను పాలించారు. అహల్యాబాయి పాలనాకాలం మరాఠా సామ్రాజ్యపు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఆమె పునరుద్ధరించారు. అహల్యాబాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది.
News October 22, 2025
వనపర్తిలో ఈనెల 24న మెగా జాబ్ మేళా

ఈనెల 24న వనపర్తిలోని రామాలయం దగ్గర ఉన్న PMKK సెంటర్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యి అభ్యర్థులు తప్పనిసరిగా 10, ఇంటర్, డిగ్రీ కలిగి ఉండాలన్నారు. హైదరాబాద్ జడ్చర్ల వనపర్తిలోని కంపెనీలలో ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 97012 00819 నంబర్ సంప్రదించాలన్నారు.


