News October 21, 2025

సర్ఫరాజ్ ఖాన్‌‌కు నిరాశ.. నెటిజన్ల ఫైర్!

image

SA-Aతో 4-డే మ్యాచులకు BCCI ప్రకటించిన IND-A <<18062911>>జట్టులో<<>> సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్లపై నెటిజన్లు ఫైరవుతున్నారు. సర్ఫరాజ్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 65+ AVg ఉందని, ఇటీవల ENG-Aపై ఓ మ్యాచులో 92, రంజీ మ్యాచులో 74 రన్స్ చేశారని, 17kgs బరువు తగ్గడంతో పాటు Yo-Yo టెస్ట్ పాసయ్యారని గుర్తుచేస్తున్నారు. దేశవాళీలో బాగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు సెలక్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.

Similar News

News October 22, 2025

ఉస్మానియా వర్సిటీలో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టులు

image

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్లలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పీజీ, పీహెచ్‌డీ లేదా నెట్/సెట్/SLET అర్హతగలవారు ఈ నెల 28లోగా ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్& సోషల్ సైన్సెస్‌లో ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, ఫిలాసఫీ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News October 22, 2025

రాణీ అహల్యాబాయి.. అందరికీ ఆదర్శం

image

మాల్వాను పాలించిన రాణీ అహల్యాబాయి హోల్కర్ ఆదర్శ పాలకుల్లో ఒకరు. 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో భర్త ఖండేరావు, 1767లో కుమారుడు మలేరావు మరణించడంతో 1795 వరకు ఇండోర్‌ను పాలించారు. అహల్యాబాయి పాలనాకాలం మరాఠా సామ్రాజ్యపు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఆమె పునరుద్ధరించారు. అహల్యాబాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది.

News October 22, 2025

RMLIMSలో 422 నర్సింగ్ పోస్టులు

image

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (RMLIMS) 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్, డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో దరఖాస్తు లింక్ ఓపెన్ కానుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drrmlims.ac.in/