News October 21, 2025

ఆజాద్ హింద్ స్ఫూర్తితో వరంగల్‌లో స్వాతంత్ర్య జ్వాలలు!

image

నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్‌లో 1943 OCT 21న ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఛలో దిల్లీ నినాదంతో స్వాతంత్ర్య సైన్యాన్ని నడిపించారు. ఆయన త్యాగం ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌లో విద్యార్థులు, స్వయంసేవకులు స్వాతంత్ర్య నినాదాలతో ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. భారత్ మాతాకిజై ఇన్‌క్విలాబ్ జిందాబాద్ వంటి నినాదాలతో వీధులు మారుమోగాయి. బోస్ ఆత్మస్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికీ ఉత్సాహాన్ని నింపింది.

Similar News

News October 22, 2025

AP న్యూస్ రౌండప్

image

*పాయకరావుపేట నియోజకవర్గంలోనే లక్ష ఉద్యోగాలిస్తాం: హోంమంత్రి అనిత
*కూలిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
*కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉగ్రవాది అబూబకర్‌ సిద్ధికి భార్య సైరాబానును కస్టడీకి తీసుకుని VJA తరలించిన NIA అధికారులు
*గుంటూరు(D) ఇటికంపాడు రోడ్డు శివారులో పిడుగుపాటుకు మరియమ్మ(45), షేక్ ముజాహిద(45) అక్కడికక్కడే మృతి

News October 22, 2025

NRPT: బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలి

image

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి పాల్గొన్నారు. 2015 సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో 13 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా, 3 కేసులు ఛార్జ్‌షిట్ దశలో ఉన్నాయన్నారు.

News October 22, 2025

NMLలో 21 పోస్టులు

image

NTPC మైనింగ్ లిమిటెడ్(NML) 21పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్‌మెంట్), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nml.co.in