News October 21, 2025

అంబర్‌పేట్‌లో బాణసంచా వివాదం.. పది మందిపై కేసు నమోదు

image

HYD అంబర్‌పేట్‌లో బాణసంచా వివాదం ఘర్షణగా మారింది. దీపావళి వేళ రాత్రి 11:30 గంటల సమయంలో సుధా పార్టీ నివాసం వద్ద పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాణసంచా పేల్చుతూ శబ్ద కాలుష్యం సృష్టించారు. వారికి స్థానిక మహిళ నిర్మల అడ్డు చెప్పగా ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారు. ఈ మేరకు బాధితురాలు అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Similar News

News October 22, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.

News October 22, 2025

మంజీరా నుంచి HYDకి కొత్త పైప్ లైన్

image

ఆరు దశాబ్దాల కిందటి మంజీరా పైప్‌లైన్ల నుంచి 20 శాతం నీరు లీకేజీల ద్వారా వృథా అవుతోంది. ఈ నీటి నష్టాన్ని అరికట్టడానికి జలమండలి సిద్ధమైంది. ఈ మేరకు రూ.722 కోట్ల వ్యయంతో కొత్త పైప్‌లైన్ వేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.

News October 22, 2025

చర్లపల్లి – దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

పండుగల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, దానాపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 23, 28 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్ (07049), 24, 29 తేదీల్లో దానాపూర్ నుంచి చర్లపల్లి (07092) రైళ్లు నడుస్తాయి. అలాగే, 26న 07049, 27న 07050 నంబరు గల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.