News October 22, 2025

అర్ధరాత్రి వరకు నిద్ర పోవడం లేదా?

image

సరైన నిద్ర లేకుంటే శరీరం అధిక కేలరీల ఆహారం కోరుకుంటుందని, దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ రావొచ్చు. ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఉదయం నిద్ర లేచాక నీరసంగా అనిపించి రోజంతా చురుకుగా ఉండలేరు. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.
Share it

Similar News

News October 22, 2025

రౌడీ చనిపోతే మానవహక్కులు గుర్తుకొస్తాయా?.. VHP ఫైర్

image

TG: NZBలో కానిస్టేబుల్‌ను చంపిన రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించడంపై మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై విశ్వహిందూ పరిషత్ ఫైరైంది. ‘పోలీసులు మరణిస్తే లేని మానవహక్కులు ఓ రౌడీ చనిపోతే గుర్తుకొస్తాయా? నేరస్థులకు మరింత ప్రోత్సాహమిచ్చేలా మాట్లాడటం హంతకులకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లే అవుతుంది’ అని మండిపడింది. జిహాదీ మూకలకు ఇదే రీతిలో జవాబివ్వాలని పోలీసులను కోరింది.

News October 22, 2025

‘బీపీటీ 2846’ వరి రకం ప్రత్యేకత ఏమిటి?

image

ఇది అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్నగింజ రకం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఇది భోజనానికి అనుకూలంగా ఉంటుంది. పంట కాలం 145 నుంచి 150 రోజులు. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. అగ్గి తెగులు, మెడ విరుపు, పొట్ట కుళ్లు తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి వస్తుంది. సేంద్రియ వ్యవసాయం, నేరుగా విత్తే విధానాలకు BPT 2846 వరి రకం అనుకూలం.

News October 22, 2025

టీఎంసీ విశాఖలో ఉద్యోగాలు

image

టాటా మెమోరియల్ సెంటర్‌(TMC) హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ (విశాఖ)‌లో 15 కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎండీ, డీఎన్‌బీ, డీఎంతో పాటు పని అనుభవం ఉన్నవారు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tmc.gov.in/