News October 22, 2025

HYD: రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం: పొంగులేటి

image

రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక వర్షాలకు పత్తి దిగుబడి తగ్గిందని, పత్తి రైతులను ఆదుకుంటామని తెలిపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే అధికారులను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.

Similar News

News October 22, 2025

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

హైదరాబాద్‌లో నేడు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ఉత్సవం జరగనున్న నేపథ్యంలో రామ్‌కోటి, లింగంపల్లి, బర్కత్‌పూరా, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

News October 22, 2025

వృద్ధులు, దివ్యాంగులకు రవాణా ఏర్పాట్లు: ఆర్వీ కర్ణన్

image

ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఆందోళన చెందొద్దని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. వారిని పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లి, తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. ఈ సదుపాయం కోసం అర్హులు ఈసీ వెబ్‌సైట్‌లో https://ecinet.eci.gov.in/homepage/home తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

News October 22, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.