News October 22, 2025
BREAKING: HYD: అమీర్‌పేట్ సదర్ ఉత్సవాల్లో అపశృతి

HYD అమీర్‌పేట్ మండలం మధురానగర్ పీఎస్ పరిధిలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఈరోజు అపశృతి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో అదుపుతప్పిన దున్నరాజు జనాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 22, 2025
542 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) 542 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వెహికల్ మెకానిక్, MSW(పెయింటర్, DES)పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగలవారు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. PET, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bro.gov.in/
News October 22, 2025
కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత

కొమురం భీం నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
News October 22, 2025
మంజీరా నుంచి HYDకి కొత్త పైప్ లైన్

ఆరు దశాబ్దాల కిందటి మంజీరా పైప్‌లైన్ల నుంచి 20 శాతం నీరు లీకేజీల ద్వారా వృథా అవుతోంది. ఈ నీటి నష్టాన్ని అరికట్టడానికి జలమండలి సిద్ధమైంది. ఈ మేరకు రూ.722 కోట్ల వ్యయంతో కొత్త పైప్‌లైన్ వేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.