News October 22, 2025
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా వాసి

తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై సమస్యల పోరాటాలు నిర్వహించారు.
Similar News
News October 22, 2025
సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

సదర్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్‌బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్‌తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.
News October 22, 2025
SECLలో 1,138 పోస్టులు.. అప్లై చేశారా?

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL) 1,138 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. Asst ఫోర్‌మెన్(543 ), మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్(595) పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్ జాబ్‌లకు OCT 30 అప్లైకి ఆఖరు తేదీ కాగా.. Asst ఫోర్‌మెన్ పోస్టులకు NOV 9 లాస్ట్ డేట్. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి.
*మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 22, 2025
సంగారెడ్డి: రేపు స్కౌట్ అండ్ గైడ్స్ పై శిక్షణ కార్యక్రమం

స్కౌట్ అండ్ గైడ్స్ కింద ఎంపికైన 38 పాఠశాలల నుంచి పాఠశాలల పీఈటీలకు గురువారం కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. పీఈటీలు సమయానికి శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.