News October 22, 2025
REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే?

2023 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. BRS నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ 64,212 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించగా ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు పొందారు.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.
News October 22, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ వెల్లువ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. ఈరోజు స్క్రూటినీ జరగనుండగా, ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.
News October 22, 2025
జూబ్లీహిల్స్: నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.