News October 22, 2025
KMR: ‘తెలంగాణ రైజింగ్ 2047’ సర్వేలో పాల్గొనండి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన “తెలంగాణ రైజింగ్ 2047” సిటిజన్ సర్వేలో కామారెడ్డి జిల్లా ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల అభిప్రాయాలను సేకరించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమన్నారు. ఈనెల 25న సర్వే ముగుస్తుంది కాబట్టి, ఆసక్తి గలవారు www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌లో సలహాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు.
Similar News
News October 22, 2025
నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.250 కోట్లు విడుదల

AP: ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ.250కోట్లు త్వరలోనే రిలీజ్ చేస్తామంది. ఈ క్రమంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు వెంటనే సమ్మె విరమించాలని విన్నవించింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భేటీ అయి నిధుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రూ.250CR విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పయ్యావుల వివరించారు.
News October 22, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇది వరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్‌తో బెట్టింగ్ చేస్తున్న రాంబిల్లికి చెందిన బంగార్రాజు, అచ్యుతాపురానికి చెందిన కొరుప్రోలు పూర్ణ కిశోర్, పరవాడకు చెందిన మేడిశెట్టి రాజు, విజయనగరానికి చెందిన గడిదేశి ఈశ్వరరావును అరెస్ట్ చేశారు.
News October 22, 2025
గద్వాల్: సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి

జిల్లాలోని రైస్ మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేసే విధంగా ఆయా రైస్ మిల్లర్ల నిర్వాహకులు కృషి చేయాలని సూచించారు.