News October 22, 2025

సంగారెడ్డి: ‘పర్యాటక కేంద్రంగా మంజీరా’

image

మంజీరా తీరాన పర్యటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంజీర నది తీరంలో ప్రకృతి వైభవాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Similar News

News October 22, 2025

అప్పుడు పాలాభిషేకాలు చేసి ఇప్పుడు ధర్నాలా?: అనిత

image

AP: YCP హయాంలోనే రాజయ్యపేట బల్క్‌డ్రగ్ పార్కుకు శంకుస్థాపన జరిగిందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ‘బొత్స, అమర్నాథ్ ఈరోజు రాజయ్యపేట వెళ్లారు. అప్పుడు పాలాభిషేకాలు చేసి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. మెడికల్ కాలేజీలపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. 2014లో రాజయ్యపేట భూములకు ఎకరాకు ₹18 లక్షలు ఇప్పించామని, ప్రజలు ఆలోచించాలని కోరారు.

News October 22, 2025

కార్తీక మాసం.. భారీగా తగ్గనున్న చికెన్ ధరలు

image

నేటి నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది. చాలామంది మాంసాహారం ముట్టకుండా శివుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. దీంతో చికెన్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి కేజీ కోడి మాంసం ధర రూ.210 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. 2,3 రోజుల్లో రేట్లు తగ్గడం ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. కేజీ చికెన్ ధర రూ.170-180కి రావొచ్చని అంటున్నారు.

News October 22, 2025

సత్య నాదెళ్లకు రూ.846 కోట్ల జీతం

image

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీ అంతకుమందు ఏడాదితో పోలిస్తే 22% అధికమైంది. ప్రస్తుతం ఆయన ఏడాదికి 96.5 మి.డాలర్ల (రూ.846 కోట్లు) జీతం అందుకుంటున్నారు. సత్య నాదెళ్ల, ఆయన లీడర్‌షిప్ టీమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మైక్రోసాఫ్ట్ పురోగతి సాధించిందని కంపెనీ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు పెరిగాయని పేర్కొంది.