News October 22, 2025
తిరుపతి: శైవక్షేత్రం దర్శనం.. కార్తీక మాస పుణీతం

పవిత్రమైన కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ శివాలయాలను గురించి తెలుసుకుందాం.
➤ శ్రీకాళహస్తి శ్రీ వాయిలింగేశ్వర స్వామి
➤ గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి
➤ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి
➤ జీవకోన శ్రీ జీవలింగేశ్వర స్వామి
➤ యోగి మల్లవరం పరశారేశ్వర స్వామి
➤ వెదల్లచెరువు శివాలయం
తదితర ఆలయాల్లో విశేష ఉత్సవాలు జరగనున్నాయి.
Similar News
News October 22, 2025
బెల్లంపల్లి: రేపు 2జిల్లాల క్రికెట్ జట్ల ఎంపిక

ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా మురళి మెమోరియల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు డీఐఈఓ అంజయ్య తెలిపారు. బెల్లంపల్లిలోని లక్కీ క్రికెట్ క్లబ్ మైదానంలో నిర్వహించనున్న ఎంపిక పోటీల్లో మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు. U-19 క్రీడాకారులు ఈ నెల 23న ఉ 9గంటలకు క్రికెట్ క్లబ్ కార్యదర్శి గౌతమ్‌కు రిపోర్టు చేయాలన్నారు.
News October 22, 2025
గద్వాల్: రోడ్డు కనెక్టివిటీకి అడుగులు..!

గద్వాల జిల్లా పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు రూ.316.45 కోట్ల నిధులు మంజూరైనట్లు MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ➤ ఎరిగెర- అయిజ- అలంపూర్ రోడ్ రూ.9.61 కోట్లు ➤ గద్వాల-జమ్మిచేడు, పూడూరు x రోడ్, పుటాన్‌పల్లి, ఎర్రవల్లి) రూ.39.84 కోట్లు ➤ గద్వాల రాయచూర్ రూ.74.29 కోట్లు ➤ గద్వాల-అయిజ రూ.24.32కోట్లు ➤ బల్గెర మాచర్ల రోడ్డు రూ.1.5కోట్లు ➤ గట్టు మాచర్ల రోడ్డు రూ.12.80 కోట్లు మంజూరయ్యాయి.
News October 22, 2025
తుని ఘటనపై మంత్రి నారా లోకేశ్ సీరియస్

తుని మండలంలోని ఓ విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. బాధితురాలికి సహాయం అందిస్తామని, హాస్టళ్లలో బాలికలకు భద్రత పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.