News October 22, 2025
కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.
Similar News
News October 22, 2025
రానున్న 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో పయనించి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అటు భారీ వర్షసూచన నేపథ్యంలో రేపు కూడా నెల్లూరు జిల్లాలోని స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
News October 22, 2025
ఆసియా కప్‌ను నేనే ఇస్తా: మోహ్సిన్ నఖ్వీ

ఆసియా కప్‌ను భారత్‌కు తానే అప్పగిస్తానని ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ట్రోఫీని భారత్‌కు అప్పగించాలని నఖ్వీకి BCCI లేఖ రాసింది. ‘ఒక వేడుక ఏర్పాటు చేస్తాం. BCCI ఆఫీస్ హోల్డర్, విన్నింగ్ టీమ్‌లో అందుబాటులో ఉన్న ఏ ప్లేయర్‌తోనైనా వచ్చి ట్రోఫీ కలెక్ట్ చేసుకోండి’ అని నఖ్వీ చెప్పినట్లు GEO న్యూస్ పేర్కొంది. ఈ విషయాన్ని ICC వద్దే తేల్చుకోవాలని BCCI ఫిక్సైనట్లు తెలుస్తోంది.
News October 22, 2025
TG న్యూస్ రౌండప్

☛ రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్ పోస్టులు సా.5గంటల లోపు మూసేయాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు
☛ నల్గొండ: మైనర్‌పై అత్యాచారం కేసు.. నిందితుడు చందుకు 32ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు
☛ రెండేళ్లలో ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాలి: ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు