News October 22, 2025

పేల సమస్యకు ఈ డివైజ్‌తో చెక్

image

వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మహిళలకు పేల సమస్య ఉంటుంది. వాటిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ హెడ్ లైస్ కోంబ్. చూడటానికి ట్రిమ్మర్‌లా కనిపించే ఈ డివైజ్ పేలతో పాటు, వాటి గుడ్లనూ ఫిల్టర్‌లోకి లాగేస్తుంది. తర్వాత డివైజ్‌ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆన్‌లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి.

Similar News

News February 8, 2026

మున్సిపల్ ఎన్నికలు.. వైన్స్, బార్లు బంద్

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ వైన్స్, బార్లు బంద్ కానున్నాయి. అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించాలని ఆదేశించింది. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

News February 8, 2026

పసికూనల పోరాటం అదుర్స్

image

T20WCలో పసి కూనలనుకున్న దేశాలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. విజయాలు సాధించకపోయినా ప్రేక్షకుల మనసులు గెలుస్తున్నాయి. నెదర్లాండ్స్‌పై పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. WIపై స్కాట్లాండ్ 35 రన్స్ తేడాతో ఓడింది. INDపై USA 29 రన్స్ తేడాతో ఓడిపోయింది. తాజాగా ENGపై నేపాల్ గెలిచినంత పని చేసి నాలుగే రన్స్ తేడాతో ఓడింది. గెలవాలన్న కసితో ఈ జట్లు ఆడిన తీరు క్రికెట్ అభిమానులను మెస్మరైజ్ చేసింది.

News February 8, 2026

పాక్ ఏజెంట్‌తో గొగొయ్‌కి సంబంధాలు: CM

image

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్‌పై అస్సాం CM హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘పాక్ ఏజెంట్ అలీ తౌఖీర్‌‌తో గౌరవ్ గొగొయ్‌, ఆయన భార్య ఎలిజబెత్‌(బ్రిటిష్ పౌరురాలు)కి సంబంధాలున్నాయి. 44పేజీల SIT నివేదిక ప్రకారం ఆమె కీలక సమాచారం పంచుకున్నట్లు ఉంది. పాక్‌కు చెందిన ఓ సంస్థ ఆమెకు జీతమిచ్చింది. గొగొయ్‌తో వివాహమయ్యాక ఆమె 9సార్లు పాక్ వెళ్లారు. గౌరవ్ కుటుంబంలో మరొకరు పాక్‌కు సహకరిస్తున్నారు’ అని ఆరోపించారు.