News October 22, 2025

అన్నమయ్య: భారీ వర్షాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08561- 293006కు కాల్ చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉండేలా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని మంత్రి పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

image

సదర్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్‌బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్‌తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్‌ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.

News October 22, 2025

SECLలో 1,138 పోస్టులు.. అప్లై చేశారా?

image

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL) 1,138 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. Asst ఫోర్‌మెన్(543 ), మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్(595) పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్ జాబ్‌లకు OCT 30 అప్లైకి ఆఖరు తేదీ కాగా.. Asst ఫోర్‌మెన్ పోస్టులకు NOV 9 లాస్ట్ డేట్. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి.
*మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 22, 2025

సంగారెడ్డి: రేపు స్కౌట్ అండ్ గైడ్స్ పై శిక్షణ కార్యక్రమం

image

స్కౌట్ అండ్ గైడ్స్ కింద ఎంపికైన 38 పాఠశాలల నుంచి పాఠశాలల పీఈటీలకు గురువారం కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. పీఈటీలు సమయానికి శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.